Thursday, October 7, 2010

నారితో నావ సవారి


మంచు పడుతున్న మాపున, పడవ ఫై పయనించు
సమయమున, నా చెలి చుసిన ఆ ఓరకంటి చూపు,
జోరు వాన జడిలో తడిచి వణుకుతున్న తరుణంలో 
తనువుపై పడ్డ గోరువెచ్చని పిడుగువలె గోచరించగా 
మనసుకు నచ్చిన మగువతో, మధురమైన మంతనాలతో 
కాలం కదలక కదులుతుంటే, కలలు కమ్మిన కళ్ళను
తియ్యని తలపులలో తూలి తిమ్మిరెక్కిన తనువును
మదనతాపంలో మునిగి మత్తెక్కిన మనసును
చల్లని మెరుపువంటి చిరునవ్వు మేలుకోలపగా
ఈ వయ్యారి వలపుల వలలో, మాటల మాయలో
పరువాల పల్లకిపై ప్రనయ పంజరంలో పట్టుబడి,
తలుపులు తెరచుటకు తపన పడుతున్న తపనుని
కిరణాలు ఈ తిమిరము తొలగించవచ్చు కాని, 
పలు మార్లు ప్రయత్నించినను పలుచపడని ఈ
నిర్మలమైన ప్రేమనుగని, నడిరేయి నట్టేట నారితో
నావ సవారీ, సూర్యునికందని స్వర్గమా అని
ఆలోచిస్తూ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

                              (గమ్యం ఎరుగని రమ్యమైన ఈ గమనం వలె అంతం లేనిధీ ఆనందం)



Tuesday, October 5, 2010

మూలకారణం



పరమార్ధమును ప్రభోధించు పద్యాల పుట్టుకకు
ఉత్తమోతమమైన గ్రంధాల ఆవిర్భావమునకు
కవ్వించే కావ్యాలు, కనువిందు చేసే కళలకు
మాపున దాగిన మర్మ చేధనకై అన్వేషణలకు
నిత్య నియమాలు, నిబందనల నుండి
దేశ రాజ్యాంగ రచన వరకు కలుగుటకు
మూలకారణం ఈ ధరితిచే ఎల్లవేళలా
ద్వేషించబడే దుఃఖం అను రెండక్షరముల పదం