Tuesday, September 21, 2010

పాపాయి నవ్వు




పున్నమి రేయి పూర్ణచంద్రుని చూపి, బువ్వ తినర బుజ్జినాన్న
అన్నఅమ్మ పలుకులు విన్న రజని అచ్చెరువొంది తల్లి తమరికి తెలియునో లేదో
రవికిరణ తాకిడిని తాలి వెండి వెన్నెలను ఇచ్చునది, ఈ బాలుని రంజింపజేసి
అతి సుందరమైన ఆ చిరునవ్వును తిలకిన్చుటకే ఎందుకనగా అది
మచ్చలేని మనసును విసదికరించే వదనముఫై విరిసిన పరిమళం
వేలాది వెలుగుల నడుమను కన్నులను కదలక నిలిపే కాంతి పుంజం
సంసార కడలిలో కదలక ఈదులాడువారిని ఒడ్డుక్కు చేర్చే నవ్వుల నావ
ఆహ్లాదం, స్వచ్చదనం, నిర్మలం, నిష్కల్మషం అను శబ్దాలకు ఏకైక పర్యాయ పదం


       తల్లీ
 నాచే కవ్వించబడి నా కాంతిని కవితలుగా మలచిన కవులు సైతం 
 చవితిన నను కాంచిన కష్టం కలుగునని కించపరచినను 
 మితిమీరిన మతికలిగిన మేధావుల మూడనమ్మకమని 
 మచ్చను మరచి మరలనూ కాంతిని ప్రసరించునది 
 మిక్కిళి మేధస్సుతో మాటలు రాని ఈ మూర్తి కొరకే

కాని తల్లీ 
పూచిన పువ్వువంటి ఈ నవ్వు కాలంతో కలుషితమవకున్న
కాడయందు మకరందం కలకాలం కధలకుండును  



Friday, September 17, 2010

నా కంటి కలవరింత





నా శ్వాస పలికిన పలుకులు నిన్ను చేరే క్షణం కోసం
నా ఊహలు నిజాలై విల్లు విరిసే తరుణం కోసం
నా పాదం పవన వీదికపై పయనించే పర్వం కోసం
నా కన్నులు కోటి కలలతో కలవరిస్తున్నది

అతిశయం




కదిలే మబ్బుల కులుకులకై కురిసే జల్లులు,
పరిమళాలు  పంచుటకై  విరిసే పువ్వులు, 
కుసుమాలపై కిలకిలలాడే సీతాకోకచిలుకలు,
మధురమైన మకరందంకై వాలు మిలిందాలు,

వాలు జడల్లోకి పూలకై పరితపించు,
పడతులు, పుడమిని  పులకిస్తుంటే, 
అమరలోక సుఖం కోసం అలమటించు 
అమాయకులు ఉండుట అతిశయమే