కదిలే మబ్బుల కులుకులకై కురిసే జల్లులు,
పరిమళాలు పంచుటకై విరిసే పువ్వులు,
కుసుమాలపై కిలకిలలాడే సీతాకోకచిలుకలు,
మధురమైన మకరందంకై వాలు మిలిందాలు,
వాలు జడల్లోకి పూలకై పరితపించు,
పడతులు, పుడమిని పులకిస్తుంటే,
అమరలోక సుఖం కోసం అలమటించు
అమాయకులు ఉండుట అతిశయమే
No comments:
Post a Comment